లోకల్.. నాన్‌లోకల్ వార్.. ఆటో డ్రైవర్ల మధ్య ముదురుతున్నసరిహద్దు పోరు
నగరంలో గ్యాస్ కొరత అధికంగా ఉండటంతో నగరంలోని గ్యాస్ బంకుల్లో ఇతర జిల్లాల ఆటోలకి ఇంధనం పోయొద్దంటూ స్థానిక ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
- ఇతర జిల్లాల ఆటోలకు నగరంలోకి నో ఎంట్రీ
సిటీబ్యూరో, ఏప్రిల్ 11 : నగరంలో గ్యాస్ కొరత అధికంగా ఉండటంతో నగరంలోని గ్యాస్ బంకుల్లో ఇతర జిల్లాల ఆటోలకి ఇంధనం పోయొద్దంటూ స్థానిక ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. తాము సాంకేతికంగా నల్గొండ, మెదక్ తదితర జిల్లాల్లో ఉంటున్నా.. తమ జీవనాధారం హైదరాబాద్‌పైనే ఆధారపడిందని చెబుతున్నారు. జిల్లా కేంద్రాలు దూరంగా ఉండటం, అకడ ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో నగరంలో తిరగకపోతే కుటుంబ పోషణ కష్టమవుతున్నదని పేరొంటున్నారు.
సరిహద్దుల్లో ఉన్న ఆటో డ్రైవర్లు తమ జిల్లా కేంద్రాలు 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయని.. వచ్చే గిరాకీ అంతా సమీపంలోని నగరానికే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి రాకపోకలు ఎకువగా ఉండటం వల్ల ఇతర జిల్లాల ఆటోలకు కూడా నగరంలోకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం వీరి మధ్య పంచామితీ రవాణా శాఖ అధికారుల వద్దకు చేరింది. కాగా, తాజాగా 65 వేల ఆటోలకు కాంగ్రెస్ సర్కారు అనుమతించింది. అందులో సీఎన్జీ, ఎల్పీజీ, పదివేలు, ఈవీ 20 వేలు, 25 వేలు రేట్రాఫిట్మెంట్ ఆటోలకు అనుమతిచ్చింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు లక్షా ఇరవై వేల ఆటోలు తిరుగుతున్నాయి. వాటిలో సగానికి పైగా 15 సంవత్సరాలకు పైబడిన పాత వాహనాలే. పాత ఆటోలను అధికారికంగా తొలగించిన తర్వాత మాత్రమే కొత్త సీఎన్జీ లేదా ఎల్పీజీ ఆటోలకు అనుమతి ఇవ్వడం వల్ల పాత ఆటోలకే భారీ డిమాండ్ ఏర్పడింది. పాత ఆటోలు రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు అమ్ముడవుతున్నాయని, ఇది పెద్ద మాఫియాగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Auto Drivers
- CNG
- Congress govt
- LPG
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

