మా ఎజెండా..బీఆర్ఎస్ జెండా
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చిం తకింది చక్రపాణి, మంచాల మండలం మాజీ ఎంపీపీ మంకు ఇందిరతో సహా వందలాది మం ది తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీల నాయకులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్పార్టీలో చేరారు.
- ఇబ్రహీంపట్నంలో టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు చక్రపాణితో పాటు వివిధ గ్రామాల నుంచి 550మంది బీఆర్ఎస్లో చేరిక
- వికారాబాద్‌లో 500 మంది నాయకులు..
- పరిగి నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 100 మంది గులాబీ తీర్థం
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీగా బీఆర్ఎస్లో చేరికలు
- అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి.. మరింత ప్రగతిని సాధిస్తాం
- హామీ ఇస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్, పంజుగుల రోహిత్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 2 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చిం తకింది చక్రపాణి, మంచాల మండలం మాజీ ఎంపీపీ మంకు ఇందిరతో సహా వందలాది మం ది తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీల నాయకులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్పార్టీలో చేరారు. మంచాల నుంచి చక్రపాణి ఆ ధ్వర్యంలో భారీ ఎత్తున బైకు ర్యాలీగా ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చే రుకున్నారు.
అనంతరం వీరంతా ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో మంచాల మండలంలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయిం ది. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చక్రపాణి, మాజీ ఎంపీపీ మంకు ఇందిర మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోనే సాధ్యమని భావించి తామంతా బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. గత 15ఏండ్లుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించి ని యోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీ సుకొచ్చారని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షే మ ఫలాలను రాజకీయాలకతీతంగా అర్హులందరికీ అందించారన్నారు.
మరోసారి ఆశీర్వదిస్తే మ రింత అభివృద్ధి సాధిస్తారనే నమ్మకంతోనే బీఆర్ఎస్లో చేరుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్ర తి ఒక్కరూ కష్టపడి పని చేసి నియోజకవర్గంలో తన గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోరారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థా నం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని పో ల్కంపల్లిలో కాంగ్రెస్, సీపీఎం నాయకులు, యా చారం మండలం ధర్మన్నగూడ, తమ్మలోనిగూడ గ్రామాలకు చెందిన నాయకులు 500 మంది కా ర్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ బీజేపీ మోర్చా మహిళా అధ్యక్షురాలు రసమల్ల శ్రీదేవీయాదగిరితో పాటు 50మంది బీజేపీ నాయకులు, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కొహెడకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే చేరిన నాయకులతో మాట్లాడారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

