యాచారం, ఆగస్టు 23 : ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తు న్న అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల రాకెట్ గుట్టును యా చారం పోలీసుల సహకారంతో మహేశ్వరం ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్)పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. 60 కేజీల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.
మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపిన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామారాజు జిల్లా, హుకుంపేట మండలంలోని అల్లంపుట్టు గ్రామానికి చెందిన కొర్రబాబు, అతడి బంధువైన దుమ్మిడిగూడ మం డలంలోని బోడిగూడ గ్రామానికి చెందిన కామేశ్వర్ వ్యవసాయం చేసేవారు. దానితో వచ్చే సంపాదన సరిపోక గంజాయిని విక్రయిస్తూ లాభాలను గడిస్తున్నారు. కాగా కొర్రబాబు మిత్రుడైన గిరీశ్ బెంగళూరులో నివసిస్తున్నాడు.
అతడు తనకు గంజాయి కావాలని కొర్రబాబు, కామేశ్వర్లను చెప్పాడు. కిలో గంజాయి రూ.10,000 చొప్పున విక్రయిస్తే 60 కేజీలకు రూ. 6,00,000 చెల్లిస్తానని గిరీశ్ వారితో ఒప్పందం చేసుకున్నాడు. కాగా కొర్రబాబు, కామేశ్వర్ గంజాయిని బెంగళూరుకు తీసుకెళ్లి గిరీశ్‌కు అప్పగించేందుకు విశాఖపట్నం జిల్లా గోపాలపట్నానికి చెందిన షేక్ మస్తాన్‌వలి, విశాఖపట్నం జిల్లా వెంకటపాలెంకు చెందిన మల్లేశ్వర్రావులను మద్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్నారు.
దీంతో ఆ నలుగురు కలిసి ఏపీలోని నర్సీపట్నం మండలంలోని వేములపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్నాయుడి వద్దకు ఈ నెల 21 మారుతి కారులో వెళ్లి గంజాయిని కిలోకు రూ.ఐదు వేల చొప్పున మొత్తం రూ.3,00,000 చెల్లించి 60 కిలోల గంజాయిని కవర్లలో నింపుకొన్నారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్, ఖమ్మం, మిర్యాలగూడ, మల్లెప ల్లి, యాచారం మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. విశ్వసనీయ సమాచారం మేరకు యాచారం పోలీసుల సహకారంతో మాల్ సరిహద్దు (అంతర్జిల్లా) చెక్‌పోస్టు వద్ద మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు ఈనెల 22 సాయం త్రం వాహనాలను తనిఖీ చేస్తూ అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కొర్రబాబు, కామేశ్వర్లను అదుపులోకి తీసుకోగా షేక్ మస్తాన్‌వలి, మల్లేశ్వర్ పరారయ్యారు. పోలీసులు వారి వద్ద నుంచి 60 కిలో ల గంజాయి, రెండు సెల్ఫోన్లు, మారుతి కారును స్వాధీ నం చేసుకున్నారు. షేక్ మస్తాన్, మల్లేశ్వర్, గిరీశ్, శ్రీనివాస్‌రావులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగా రు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామన్నారు. కార్యక్ర మంలో యాచారం సీఐ శంకర్‌కుమార్, ఎస్ఐలు మధు, సత్యనారాయణలు పాల్గొన్నారు.