బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 05, 2020 , 01:04:32

పోషకాహారంతోనే ఆరోగ్యం

పోషకాహారంతోనే ఆరోగ్యం

పుట్టినబిడ్డకు తల్లిపాలు శ్రేయస్కారం

30వ తేదీ వరకు ‘పోషణమాసం’ కార్యక్రమాలు

బడంగ్‌పేట, సెప్టెంబర్‌4: పుట్టినప్రతి బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కారమని సీడీపీవో వినీతాదేవి అన్నారు. నెల 30వరకు  పోషణ మాసం కార్యక్రమాలు ఉంటాయన్నారు. శుక్రవారం సరూర్‌నగర్‌లో అవగాహన నిర్వహించారు. చిన్నారులకు సంబంధించిన పోషణ సంరక్షణ పై అంగన్‌వాడీ టీచర్లు ఆవగాహన కల్పిస్తారని ఆమె తెలిపారు. ప్రతిరోజు హౌస్‌ విజిట్‌ చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. తక్కువ బరువు ఉన్న ఐదుగురు చిన్నారుల బరువు, కొలతలు తీసుకోవాలన్నారు. పుట్టిన ప్రతిబిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టాలన్నారు. ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే పట్టిస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌ వైజర్స్‌ సావిత్రి, యశోద, సువర్ణ, మౌనిక, విజయలక్ష్మి, సూర్యకళ తదితరులు ఉన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరటి తోటలను పెంచాలి

మహేశ్వరం: అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరటితోటలను పెంచాలని సీడీపీవో షభానాహుస్సేన్‌ అన్నారు. శుక్రవారం జాతీయ పోషణ మాసాన్ని పురస్కరించుకొని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విద్యాధరి ఆధ్వర్యంలో పోషణ లోపాన్ని అరికట్టడానికి అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరటి తోటల ఆవశ్యకతపై అక్కడి టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజు తినే ఆహారంలో అన్నిరకాల పోషకాలు లభించే ఆహారపదార్థాలను చేర్చుకోవాలని అన్నారు. గర్భిణులు, చిన్నారులు రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పాలు, పండ్లను చేర్చుకోవాలని సూచించారు.