షాబాద్, మే 18 : రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులకు సబ్సిడీపై జనుము విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు, విత్తనాల ను కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 65 శాతం సబ్సిడీపై జనుము విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు.
రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చే పంటలు వేయాలని సూచించారు. త్వరలో రైతులకు ఖరీఫ్ పంట సాగుకు సంబంధించిన రైతుబంధు డబ్బులు అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరు మల్లేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, ఏవో వెంకటేశం, సీఈవో శివకుమార్‌రెడ్డి, ఏఈవో రాఘవేందర్, టీఆర్ఎస్ నాయకులు బల్వంత్‌రెడ్డి, పాపిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాంచందర్, నర్సింహులు తదితరులున్నారు.