మొయినాబాద్, మార్చి 2: దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు అంజయ్యగౌడ్ ఆధ్వర్యంలో సర్దార్‌సర్వాయి పాపన్నగౌడ్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అదే విధంగా సురంగల్ గ్రామంలో సురంగల్ గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్‌గౌడ్, గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి యువజన విభాగం మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపాన్నగౌడ్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దళిత, బహుజనులను ఏకం చేయడానికి ఎంతో కృషి చేసి బహుజన రాజ్యం వైపు నడిపించిన వ్యక్తి పాపన్నగౌడ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీరాంనగర్ గౌడ కుల సంఘం అధ్యక్షుడు మహిపాల్‌గౌడ్, ఎన్కేపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్, గౌడ సంఘం నాయకులు రాఘవేందర్‌గౌడ్, సుధాకర్‌గౌడ్, శివయ్యగౌడ్, దర్శన్‌గౌడ్, ఎట్టయ్యగౌడ్, మల్లేష్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, రాజుగౌడ్, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
కేశంపేట : బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని బీఆర్ఎస్ యువ నాయకుడు ప్రేమ్‌కుమార్‌గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి నుంచి షాద్‌నగర్‌కు తరలివెళ్లి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. బహుజన రాజ్యాధికారంకోసం పీడిత వర్గాల పక్షాన పోరాడిన ధీరుడని, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌గౌడ్, మహేశ్‌గౌడ్, రాఘవేందర్‌గౌడ్, అభిలాష్‌గౌడ్, రఘుగౌడ్, ప్రవీణ్‌గౌడ్, సందీప్‌గౌడ్, వంశీగౌడ్, కార్తీక్‌గౌడ్ పాల్గొన్నారు.
ఆమనగల్లు : పాపన్నగౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు అల్లాజీగౌడ్ ఆధ్వర్యంలో కాటమయ్య దేవస్థాన ఆవరణలో ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గంగారవి, పట్టణ అధ్యక్షుడు వెంకటయ్యగౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌గౌడ్, నాయకులు అల్లాజీ, నర్సింహ, శివ, వెంకటేశ్, అంజి, సాయి, మనోజ్ ఉన్నారు.
సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలి
కడ్తాల్ : సర్దార్ సర్వాయి పాపాన్నగౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల గౌడ సంఘం అధ్యక్షుడు బాలకుమార్‌గౌడ్ అన్నారు. బుధవారం తలకొండపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో తాలుకా ఉపాధ్యక్షుడు శ్రీశైలంగౌడ్, యువజన ఉపాధ్యక్షుడు రవిగౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్‌గౌడ్, నాయకులు విష్ణుగౌడ్, గణేశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సురేశ్‌గౌడ్, శ్రీశైలంగౌడ్, ప్రదీప్‌గౌడ్, అనిల్, జంగయ్య, కృష్ణ, నరేందర్‌గౌడ్, పాండు, లక్ష్మీకాంత్‌గౌడ్, జగదీశ్వర్‌గౌడ్, రాజుగౌడ్, మధుగౌడ్, అల్లాజీగౌడ్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని మండల పరిషత్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి బుధవారం గౌడ యువజన సంఘం నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌గౌడ్, ప్రేమ్‌కుమార్‌గౌడ్, అభిలాష్‌గౌడ్, మహేష్‌గౌడ్, రఘుగౌడ్, సందీప్‌గౌడ్, కార్తీక్‌గౌడ్, ప్రవీణ్‌గౌడ్, రఘుగౌడ్, వంశీగౌడ్, శ్రీకాంత్‌గౌడ్, శివశంకర్‌గౌడ్, గోపాల్‌గౌడ్, ఉదయ్‌గౌడ్ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని శంకర్పల్లి పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ అన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని పురసరించుకొని బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని కల్లు దుకాణం ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాపన్నగౌడ్ గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.