get together | చేవెళ్ల రూరల్, మే 25: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద జడ్పీహెచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2005- 06 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్ లోనే ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒక్కచోట కలుసుకోవడంతో గత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల గురించి, కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు. ఈ సందర్భంగానే తమకు చదువు చెప్పిన గురువులకు శాలువా కప్పి సన్మానించారు. వారికి మెమొంటోలను అందజేశారు.