గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్తపీట
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలు, తండాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి
- ముద్విన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
కడ్తాల్, ఏప్రిల్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలు, తండాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో రూ.1.85 కోట్లతో చేపట్టిన ముద్విన్-ఆకుతోటపల్లి గ్రామాల మధ్య వంతెన, రూ.10 లక్షలతో చేపట్టిన మహిళా సమాఖ్య భవనం, రూ.20 లక్షలతో చేపట్టిన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపనతోపాటు, రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలు, తండాల అభివృద్ధికి అత్యధిక నిధులను కేటాయించిందని తెలిపారు. సంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, తండాలు కొత్త శోభను సంతరించుకున్నాయని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని, మిషన్ భగీరథ తాగునీటి సమస్యలు శాశ్వతంగా దూరమయయ్యాని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్‌లు యాదయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి, భాగ్యమ్మ, భారతమ్మ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, నిర్మలమ్మ, రాములుగౌడ్, మంజుల, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, ఉపసర్పంచ్లు వినోద్, ము త్యాలు, నర్సింహ, శారద, నాయకులు రాంరెడ్డి, రాఘవరెడ్డి, గోపాల్, రాజు, జంగయ్య, పర్వతాలు, మహేశ్, శ్రీనివాస్, వ్యవసాయశాఖ ఏవో శ్రీలత, ఏఈవో అభినవ్‌రెడ్డి, రైతులున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

