కొడంగల్, డిసెంబర్ 15: ఓడినా.. గెలిచినా.. ప్రజల మధ్యనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం నియోకవర్గ పరిధిలో పలు వివాహవేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని, ప్రజా తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఓడిపో యినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఉంటుందని భరోసా కల్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవ సరం లేదని ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.