ధారూరు, డిసెంబర్ 13: మండల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకూదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ…మీ అం దరికీ అండగా ఉంటానని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎబ్బనూరు, అల్లీపూర్ గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వ హించారు.
అనంతరం ఎబ్బనూరు గ్రామంలోని హనుమాన్ దేవాల యం లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని శివలింగానికి అభి షేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజూనాయక్, మండల మాజీ అధ్య క్షుడు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కావలి అంజయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు రాములు, అంజ య్య, గోపాల్, చిన్నయ్యగౌడ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.