తుర్కయంజాల్, ఆగస్టు 21 : గణేష్ మండపానికి హై టెన్షన్ తీగలు తగిలి మంటలు చేలరేగడంతో పెను ప్రమాదం తప్పిన సంఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి సూరజ్ నగర్ కాలనీలో వినాయకుడి ప్రతిమను ఉంచడానికి సీసీ రోడ్డు మధ్యలో హై టెన్షన్ తీగల కింద గణేష్ మండపాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయితే గణేష్ మండపం హై టెన్షన్ తీగలకు దగ్గరగా ఏర్పాటు చేయడంతో హై టెన్షన్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి.
సకాలంలో కాలనీ వాసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో మండపం వద్ద ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణం నష్టం జరగలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆదిభట్ల పోలీసులు గణేష్ మండపాన్ని జేసీబీ సహయంతో తోలగించారు. అనుమతులు లేకుండా ప్రమాదకరంగా గణేష్ మండలపాలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.