పట్టా భూముల నుంచి రోడ్డు వేయొద్దు
ఫార్మాసిటీ బైపాస్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని నాగార్జునసాగర్ రహదారి (తక్కళ్లపల్లిగేట్) నుంచి తక్కళ్లపల్లి, మేడిపల్లి మీదుగా రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకోసం తక్కళ్లపల్లి వద్ద బైపాస్‌తోపాటు తక్కళ్లపల్లి నుంచి మేడిపల్లి వెళ్లే రోడ్డులో మేడిపల్లి వద్ద బైపాస్‌తో నేరుగా ఫార్మాసిటీ భూముల్లోకి 100 ఫీట్ల రోడ్డు పను లు కొనసాగుతున్నాయి.
- ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి సూచించిన రైతులు
- జోరుగా సాగుతున్న ఫార్మా బైపాస్ రోడ్డు పనులు
- ఫార్మాసిటీకి కేటాయించిన భూములు స్వాధీనం
యాచారం, మే 14 : ఫార్మాసిటీ బైపాస్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని నాగార్జునసాగర్ రహదారి (తక్కళ్లపల్లిగేట్) నుంచి తక్కళ్లపల్లి, మేడిపల్లి మీదుగా రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకోసం తక్కళ్లపల్లి వద్ద బైపాస్‌తోపాటు తక్కళ్లపల్లి నుంచి మేడిపల్లి వెళ్లే రోడ్డులో మేడిపల్లి వద్ద బైపాస్‌తో నేరుగా ఫార్మాసిటీ భూముల్లోకి 100 ఫీట్ల రోడ్డు పను లు కొనసాగుతున్నాయి. గురువారం ఆ పనులను ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.
తక్కళ్లపల్లి నుంచి మేడిపల్లి వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డునే వెడల్పు చేస్తుండగా.. అటు మేడిపల్లి నుంచి పల్లెచెల్కతండా రోడ్డు నూ విస్తరించి ఫార్మాసిటీకి అనుసంధానం చేస్తున్నారు. కాగా, మేడిపల్లి, తక్కళ్లపల్లి గ్రా మాల వద్ద ఊరి చివర నుంచి బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు కొంతమంది రైతుల పట్టా భూముల నుంచి వెళ్తున్నది. దీనికోసం ఆర్డీవో అనంతరెడ్డి రోడ్డు పనులతోపాటు రోడ్డు కోసం సేకరించాల్సిన పట్టా భూములను పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి రైతులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
భూములిచ్చేదే లేదు..
ఆర్డీవో అనంతరెడ్డి భూముల పరిశీలనకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. తమ పట్టా భూముల నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టొద్దని ఆర్డీవోకు విన్నవించారు. తమకు ఉన్న కొద్దిపాటి పొలం మధ్య నుంచి 100 ఫీట్ల రోడ్డు వెళ్తే తాము ఎలా వ్యవసాయం చేసుకుని జీవించాలని రైతు మక్కపల్లి రాములు, వార్డు సభ్యు డు మక్కపల్లి మహేశ్ ప్రశ్నించారు. మా భూమిని రోడ్డుకు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ పట్టా భూమిని గతంలోనే ఫార్మాకు ఇవ్వలేదని..కోర్టు కేసు ఉన్న భూమిని రోడ్డు కోసం ఎలా సేకరిస్తారని మరో రైతు కలకొండ జంగయ్య ఆర్డీవోను ప్రశ్నించారు.
గతంలో ఫార్మా భూ ములకు కంచె వేసేటప్పుడు తన పట్టా భూమి జోలికి రామని అధికారులు హామీ ఇచ్చినట్టు తెలిపాడు. కోర్టు కేసు క్లియర్ అయ్యే వరకు మా భూమిలోకి ఎవరూ రావొద్దన్నాడు. అనుమతి లేకుండా పట్టా భూము ల్లో ఎలా పనులు నిర్వహిస్తారని మాజీ సర్పంచ్ నిర్మలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రమేయం లేకుండా, పరిహారం ఎంతిస్తారో చెప్పకుండా భూముల్లోకి రావొద్దని రైతులు హెచ్చరించారు. రైతులకు అన్యా యం చేయొద్దని మాజీ సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, బోడ కృష్ణ, మాజీ ఎం పీటీసీ శ్రీశైలం, గ్రామస్తులు సంపత్, దోస మహేశ్ అధికారులకు సూచించారు. నానక్‌నగర్ వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేశామని రైతులు అక్కడికొచ్చి సమస్యలు వివరించాలని తహసీల్దార్ అయ్యప్ప సూచించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

