విండీస్ మూడోసారీ.. వన్డే వరల్డ్‌కప్‌లో ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ ఆశలు ఆవిరి
వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన వెస్టిండీస్‌కు మరోసారి ఝలక్. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని ఆ జట్టు కోల్పోయింది.
ఢిల్లీ: వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన వెస్టిండీస్‌కు మరోసారి ఝలక్. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని ఆ జట్టు కోల్పోయింది. ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గాన్.. రెండో వన్డేలో గెలవడంతో విండీస్ ఆశలు అడియాసలయ్యాయి. వాస్తవానికి ఈ సిరీస్‌ను ఐర్లాండ్ 5-0 లేదా 4-1తో గెలిచి తర్వాత వెస్టిండీస్.. భారత్‌తో వన్డే సిరీస్‌ను 2-0తో నెగ్గితేనే కరీబియన్లకు ప్రపంచకప్‌లో డైరెక్ట్ క్వాలిఫికేషన్ దక్కేది.
కానీ తొలి వన్డే వర్షార్పణమవగా రెండో వన్డేలో అఫ్గాన్ నెగ్గడంతో వెస్టిండీస్ కథ ముగిసినైట్టెంది. వరల్డ్‌కప్‌లో ర్యాంకింగ్‌ల ఆధారంగా జట్లు టోర్నీకి అర్హత సాధిస్తాయన్న విషయం విదితమే. ర్యాంకింగ్స్‌లో టాప్-8న ఉండే జట్లు నేరుగా వరల్డ్ కప్ ఆడాల్సి ఉండగా మిగతా జట్లు క్వాలిఫికేషన్ రౌండ్ ఆడి ప్రధాన టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా క్వాలిఫికేషన్ రౌండ్ ఆడటం వెస్టిండీస్‌కు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

