Rangareddy | రంగారెడ్డి, మార్చి 5 : రంగారెడ్డి జిల్లా రైతాంగం పంటలు ఎండిపోయి అల్లాడుతున్నారు. ఏ గ్రామంలో చూసిన సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేశారు. సాగు చేసిన పంటలకు సరిగా నీరు అందకపోవడం వలన ఎండిపోతున్నాయి. ఎండాకాలం ఆరంభంలోనే పంటలు ఎండిపోతుండడంతో అంతంత మాత్రంగా ఉన్న వరి పంట కూడా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. పంటలు కళ్ల ముందు ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
మరి అప్పులు చేసి వరి పంటలు సాగు చేశామని పంటలు ఎండిపోతుండడంతో చేసిన అప్పులు తీర్చే మార్గాలు లేక ఉరేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయని రైతులకు పోతున్నారు. ఎండిపోయిన పంటలను గొర్రెలను మేపుకోవడానికి ఇస్తున్నారు. భూగర్భ జలాలు ఒక్కసారిగా పడిపోవడంతో రోజంతా పోసే బోరు బావులు గంటసేపు కూడా నీరు పోయలేని పరిస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాట్లు వేసే ముందే పెట్టుబడి సాయం అందించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందించకపోగా రుణాలను కూడా మాఫీ చేయలేదు. ఈ పరిస్థితిలో రైతులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు. పంటలు ఎండిపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.