పరిగి, సెప్టెంబర్ 19 : రైతన్నను యూరియా కొరత వెంటాడుతున్నది. సరిపడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిగికి బుధవారం యూరియా కాగా.. గురు, శుక్రవారాల్లో రాలేదు. ఎరువు అవ సరమైన రైతులు ఉదయం 6 గంటలకే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, ఇతర ఫర్టిలైజర్ షాపుల ఎదుట నిరీక్షించారు. షాపులు తెరిచిన తర్వాత యూరియా ఈ రోజు రావడం లేదని చెప్పగా మధ్యాహ్నం వరకు ఉండి ఇం డ్లకు వెళ్లిపోయారు. మరో రెండు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా రైతులు నానో యూరియా వాడాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
మంచాల : మంచాల సహకార సంఘం కార్యాలయానికి యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆ కార్యాలయం ఎదుట క్యూలో అధిక సంఖ్యలో నిరీక్షించా రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు సరిపడా యూరియా అందిందని.. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో యూ రియా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని అన్నదాతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. సర్కార్ స్పందించి సరిపడా అం దించాలని డిమాండ్ చేశారు.