రంగారెడ్డి, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : పరిహారం తేల్చకుండా పట్టా భూముల్లో నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ ధర కాకుండా బయటి మార్కెట్లో ఉన్న విధంగా నష్టపరిహారాన్ని చెల్లిస్తే భూములిస్తామని ఇప్పటికే బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. కాగా, అధికారులు మాత్రం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుపై దూకుడు పెంచారు. ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం 14 వేల ఎకరాలను సేకరించిం ది. అందులో 2 వేల ఎకరాల పట్టా భూములున్నాయి. అవి ప్రభుత్వం సేకరించిన భూ ములకు మధ్యలో ఉండడంతో వాటిని కూ డా తీసుకోవాలని నిర్ణయించింది. అయితే రైతులు మాత్రం ఆ భూములను ఇచ్చేది లేదని మొండికేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతుల భూముల పరిహారాన్ని అథారిటీలో జమచేసి ఆ భూములను టీజీఐఐసీ పేరున రికార్డులను మార్చడంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..నష్టపరిహారం తేల్చేవరకు రైతుల భూముల్లోకి అధికారులు వెళ్లొద్దని స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినా ప్రభు త్వం మొండిగా పట్టా భూముల్లో గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు ఏర్పాటుకు సిద్ధమైంది.
సర్వేనంబర్లు 283, 286, 274లలో యా చారం మండలంలోని మంగలిగడ్డతండా, మర్లకుంటతండా, పోతుబండతండా గ్రా మాల్లోని రైతులకు చెందిన సుమారు 30 ఎకరాల పట్టా భూముల నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వెళ్తుంది. ఈ పనులను శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత రైతులు అక్కడికి చేరుకుని నిలిపేశారు. 30 ఎకరాల పట్టా భూములను తాము ఇవ్వమని స్పష్టం చేశారు. కానీ, ప్ర భుత్వం మాత్రం రైతుల పరిహారాన్ని అథారిటీలో జమచేసి ఆ భూములను టీజీఐఐసీ పేరున రికార్డులను మార్చడంతో రైతులు కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ పొందారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో ఆ పనులను అడ్డుకుని అధికారులను వెనక్కి పంపించారు. పరిహారం తేల్చేవరకు పనులను జరుగనివ్వమన్నారు.
యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు పోగా.. మూడు వేల రైతులకు చెందిన మరో 2 వేల ఎకరాల పట్టా భూములున్నాయి. వాటినీ ఫార్మాసిటీ కోసం తీసుకోవాలని సర్కార్ నోటిఫికేషన్ జారీచేసింది. రైతులు మాత్రం పట్టా భూములకు పరిహారాన్ని తేల్చాలని.. భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాం డ్ చేస్తున్నారు. తమ భూములను తీసుకోవద్దంటూ కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు.
ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగా.. అధికారులు మాత్రం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేసేందుకు యత్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు రైతుల వద్దకు వెళ్లి వారిని రెచ్చగొట్టడమే కాకుండా.. తాము అధికారంలోకి రాగానే పట్టా భూములను తిరిగి రైతులకు ఇస్తామని ప్రకటించి.. ఓట్లు వేయించుకుని ఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడేమో మాటతప్పి భూములను గుంజుకునేందుకు యత్నిస్తు న్నారని రైతులు మండిపడుతున్నారు.