ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 6 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో 2, శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలలో 2., శ్రీదత్త, సీవీఆర్ కళాశాలల్లో ఒక్కో పరీక్షా కేంద్రం చొప్పున కేటాయించగా.. 4021 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆదివారం ఎస్ఓటీ డీసీపీ మురళీధర్‌రావు, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు పరిశీలించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని వారు అధికారులను ఆదేశించారు.