Mission Bhagiratha | ఒకప్పుడు ఆ తండాలో పనిచేయని చేతిపంపులు.. మహిళల చేతుల్లో ఖాళీ బిందెలు.. నేడు ఇంటింటికీ నల్లా కనెక్షన్
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాది పొడవునా గుక్కెడు నీటి కోసం ప్రజలు పరితపించేవారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట మండలం దేవులానాయక్తండాలో పని చేయని చేతి పంపులు కనిపించేవి. మహిళలు ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డెక్కి చేసే ఆందోళనలు నిత్యకృత్యం. పగటి పూట వ్యవసాయ బావుల వద్దకు వెళితే రైతులు తిడుతారన్న భయంతో రాత్రిళ్లు జాగారం చేసి కిలో మీటరు దూరం నడిచి నీళ్లు తెచ్చుకునేవారు.
నాడు తాగునీటి కోసం తండ్లాట
Mission Bhagiratha | ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాది పొడవునా గుక్కెడు నీటి కోసం ప్రజలు పరితపించేవారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట మండలం దేవులానాయక్తండాలో పని చేయని చేతి పంపులు కనిపించేవి. మహిళలు ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డెక్కి చేసే ఆందోళనలు నిత్యకృత్యం. పగటి పూట వ్యవసాయ బావుల వద్దకు వెళితే రైతులు తిడుతారన్న భయంతో రాత్రిళ్లు జాగారం చేసి కిలో మీటరు దూరం నడిచి నీళ్లు తెచ్చుకునేవారు. పనులు మానుకుని వ్యవసాయ బోరు వద్ద నీటి కోసం గుమిగూడి తండా వాసులు పడుతున్న పాట్లు ఈ చిత్రంలో చూడవచ్చు.
నేడు ఇంటి ముందుకే స్వచ్ఛమైన తాగునీరు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఫొటో కూడా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట మండలం దేవులానాయక్తండాలోనిది. తెలంగాణ వచ్చిన తరువాత ప్రజల దాహార్తిని తీర్చడానికి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. తండాలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడంతో ప్రజల తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. ఏ బాదరబందీ లేకుండా ఇంటి ముందున్న నల్లా ద్వారా స్వచ్ఛమైన నీటిని పట్టుకుంటున్నారు. ఏడాది పొడవునా ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వస్తున్నాయని, తమ తండాకు నీటి కష్టాలు దూరమయ్యాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

