Agriculture | రంగారెడ్డి, మార్చి 4 ( నమస్తే తెలంగాణ ) : రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. వేసవి ఆరంభంలోనే అన్నదాతలకు కష్టాలు మొదలైనవి. జిల్లాలో వేసిన వరి పంట పొలాలు నీరు సరిపోక నిండిపోతున్నాయి ఓవైపు రైతు భరోసా రాక అన్నదాతలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారు.. కానీ సాగునీరు లేక కళ్ల ముందు పంట పొలాలు ఎండిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. సుమారు 50 నుంచి 60 వేల ఎకరాలలో వరి పంటలను సాగు చేశారు. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి, చింతకుంట్ల, మంచాల మండలంలోని దాదిపల్లి, బోడకొండ ఎల్లమ్మ తండా తదితర గ్రామాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరు లేకపోవడం వలన పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకపోవడంతో అప్పులు చేసి పంటలు సాగు చేశామని పంటలు ఎండిపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు గౌరవెల్లి గ్రామంలో పిచ్చకుంట్ల సత్తయ్య అనే రైతు రెండెకరాల వరి నాటువేగా పూర్తిగా ఎండిపోయింది. అలాగే జాటోత్ కిషన్ వేసిన మూడెకరాలు కూడా సగం వరకు ఎండిపోయింది ఎండిపోయిన పంట పొలాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.