షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 9 : ప్రతి పేదోడికీ సొంత ఇల్లు అనేది ఒక కల. దాని సాకారానికి తెలంగాణ ప్రభు త్వం రెండు పడకల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి.. ఇచ్చిన మాట ప్రకారం నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లును ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు పక్కా ప్రణాళికతో ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నది. మౌలిక వసతులతో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితో..
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షాద్‌నగర్ పట్టణంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంలో మొత్తం 1,880 ఇండ్ల నిర్మాణాలకు సర్కారు నుంచి అనుమతి తీసుకొచ్చారు. వీటిలో షాద్‌నగర్ పట్టణంలో 1700 ఇం డ్లు, నందిగామ పరిధిలో 120 ఇండ్లు, తిమ్మాపూర్‌లో 60 ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయి. షాద్‌నగర్ పట్టణంలో చేపట్టిన 1700 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్త యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతా ల్లోనూ ఇండ్ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి.
అర్హులైన వారికే ఇండ్లు..
షాద్‌నగర్ పట్టణంలో మొత్తం 1700 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. షాద్‌నగర్ పట్టణంలోని 28 వార్డుల్లోని అర్హులైన వారిని గుర్తించి, నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌తో ఇండ్లను కేటాయిస్తాం. లబ్ధిదారులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
– నరేందర్,మున్సిపల్ చైర్మన్, షాద్‌నగర్
సంతోషకరం..
ప్రతి పేదోడి సొంతింటి కలను నిజం చేసేలా సర్కార్ అడుగులు వేయడం చాలా సంతోషంగా ఉంది. షాద్‌నగర్ పట్టణంలో నిర్మించిన ఇండ్లు చాలా బాగున్నాయి. అర్హులకే ఆ ఇండ్లను అధికారులు, నాయకులు కేటాయించాలి. – అనిల్, షాద్‌నగర్