కడ్తాల్, ఆగస్టు 15 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంల మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి రూ.50 వేల విరాళాన్ని బోనాల ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోచమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్ సత్యంయాదవ్, కమిటీ సభ్యులు మల్లేశ్‌గౌడ్, రామచందర్‌నాయక్, నాయకులు బీచ్యానాయక్, భానుకిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, జంగయ్య, శ్రీకాంత్, యాదయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.