వికారాబాద్, డిసెంబర్ 29 : వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి తాండూ రు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి చేరుకుని స్నేహమెహ్రాకు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టొద్దని వినతి పత్రాన్ని అం దజేశారు. అనంతరం మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడు తూ ..కోట్‌పల్లి సర్పంచ్‌పై జరిగిన దాడి విషయంలో పోలీసులు పారదర్శం గా విచారణ జరపాలన్నారు.
కాంగ్రె స్ నాయకులు దౌర్జన్యాలు, భూ కబ్జాలు చేస్తున్నారని వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయ ని, వాటిని అవసరం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు. కొంతమం ది పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, భూకబ్జాలు చేసిన వారి పేర్లను పింక్‌బుక్‌లో ఎంట్రీ చేస్తున్నామని.. మరో రెండేండ్లలో రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని..బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందిపెట్టిన వారు ఏ మూలన దాక్కు న్నా బయటికి తీసుకొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అనంతరం తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి రౌడీయిజం, అరాచకం, దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులపై అక్ర మ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటివి చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కోట్‌పల్లి ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే, కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్న పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆయన కోరారు. కాం గ్రెస్ నాయకులు గ్రామాల్లో దౌర్జన్యా లు ఆపకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, కోట్‌పల్లి మండలాధ్యక్షులు అనిల్, వికారాబాద్ మండలాధ్యక్షు డు మహిపాల్‌రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గయాజ్, మాజీ కౌన్సిలర్ అనంత్‌రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు సుభాన్‌రెడ్డి, అశోక్, అనిల్, గిరీశ్కొఠారీ, నాయకులు పాల్గొన్నారు.