రంగారెడ్డి, మే 12 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్‌సభ ఎన్నికకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 43 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 29,38,370 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటింగ్‌కోసం మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశా రు.ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. 13, 443 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 3,591 కంట్రోల్ యూ నిట్లు, 10,757 బ్యాలెట్ యూనిట్లు, 4,008 వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 9,83,191 మంది ఉండగా.. అందులో పురు షులు 4,85,210 మంది, మహిళలు 4,97,946 మంది, ఇతరులు 35 మంది ఉన్నారు.
కొడంగల్ సెగ్మెంట్లో మొత్తం ఓటర్లు 2,41,794 మంది ఉండగా.. అందులో పురుషులు 1,18,856 మంది, మహిళలు 1,22,933 మంది , ఇతరులు ఐదుగురున్నారు. మరోవైపు జిల్లాలో 7248 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల య్యాయి. జిల్లావ్యాప్తంగా 1434 బ్యాలెట్ యూనిట్లు 1434 కంట్రోల్ యూనిట్లు, 1605 వీవీప్యాట్లను సిద్ధంగా ఉంచారు. 1148 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 303 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు అధికారులు గుర్తిం చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఐదు పోలింగ్ కేంద్రాలను మహిళా ఓటర్లకు, ఐదు మాడల్ పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులకు, యువతకు ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఎన్నికల యంత్రాంగం ఏర్పాటు చేసింది.
Polling Centers
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అధికారులు ఏడుచోట్ల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో తరలివెళ్లారు. సోమవారం ఉదయం 5.30 గంట లకే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ అనంతరం ఏడు గంటలకు సాధా రణ పోలింగ్ ప్రక్రియ మొదలుకానున్నది. లోక్‌సభ పరిధిలో 2,877 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేయగా.. దివ్యాంగులు, మహిళలు, యువత కోసం మాడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల సంఖ్య కంటే 25 శాతం అదనంగా(రిజర్వు) బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లను అందుబాటులో ఉంచుతున్నా రు. మైక్రోఅబ్జర్వర్లు 216 మంది, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు కలుపుకొని 13,443 మందికి పోలింగ్ విధుల కోసం ర్యాండమైజేషన్ ద్వారా బాధ్యతలు కేటాయించారు. 20 శాతం మంది రిజర్వ్డు సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల ప్రక్రియను ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు ఐడీ లేకుంటే ఇతర 12 రకాల ఐడీ కార్డులకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
చేవెళ్ల లోక్‌సభ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టాం. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటేసేందు కు వెళ్లేవారు ఓటరు కార్డు లేదా ఎన్నికల సంఘం గుర్తించిన ఏదో ఒక గుర్తింపు కా ర్డును వెంట తీసుకెళ్లాలి. దివ్యాంగులు, మహిళలు, యువతకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశాం.
– నారాయణ రెడ్డి, వికారాబాద్ కలెక్టర్, ఎన్నికల అధికారి
ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్(పీవో), ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్(ఏపీవో), ముగ్గురు సహాయక ప్రిసైడింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించను న్నారు. ఈ లెక్కన మొత్తం 13,443 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొను న్నారు. అదనంగా మరో 20 శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుతున్నారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కోసం 256 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. ఇంకా కొంతమందిని ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు.