మత్స్యకారులకు సిరుల పంట పండుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలోని చెరువుల వద్ద కుప్పలుకుప్పలుగా చేపల రాశులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకంతో చేపట్టిన చెరువులు, కుంటల మరమ్మతులతో పాటు వర్షాలు సమృద్ధిగా కురువడంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి.
మత్స్యకారుల ఉపాధి కోసం సుమారు రూ.కోటీ 17 లక్షలను వెచ్చించి జిల్లాలోని 801 చెరువుల్లో వంద శాతం సబ్సిడీ కింద ఈ ఏడాది కోటీ 63 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలింది. ప్రస్తుతం అవి 5 నుంచి 6 కిలోల వరకు పెరిగి పెద్దవయ్యాయి. దీంతో మత్స్యకారులకు చేతినిండా పని దొరుకుతున్నది. ఆదివారం అయితే చాలు చేపలు కొనేందుకు వచ్చిన జనంతో చెరువుల వద్ద సందడి వాతావరణం నెలకొంటున్నది. ఇబ్రహీంపట్నం, రావిరాల, ఇంద్రాసాగర్, తుర్కయాంజాల్‌లోని మాసబ్చెరువులోని చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. గత ప్రభుత్వం అందించిన సహకారంతో చేపల ఉత్పత్తి పెరిగి సిరుల పంట పండుతుండడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
– ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16 : రంగారెడ్డి జిల్లా లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. గతంలో ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురయ్యారు. మత్స్యకారుల ఉపాధి కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లల ఉత్పత్తితో ఏ చెరువులో చూసిన కుప్పలు కుప్పలుగా చేపలు దొరుకుతున్నాయి. దీంతో వారికి చేతినిండా పని దొరకడంతో పాటు చేపలను విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు.
గ్రామాల్లో ఉన్న చెరువుల్లో సైతం ప్రభుత్వం చేప పిల్లలను విడిచిపెట్టడంతో ఆయా పల్లెల్లో ఉన్న మత్స్యకారులు చేపలను ప ట్టుకొని విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 801 చెరువులను అధికారులు గుర్తించి మిషన్ కాకతీయ పథకం ద్వారా గత ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు నిండింది. 801 చెరువుల్లో 2023 సంవత్సరానికి రూ.కోటి 17 లక్షల వ్యయంతో కోటి 62 లక్షల చేప పిల్లలను వదిలి పెట్టారు.
గత ప్ర భుత్వ హయాంలో 2016-17 నుంచి వరుసగా చెరువుల్లో చేప పిల్లలను వదులుతున్నారు. ఒక్కో చెరువులో 5 నుంచి 6 కిలోల వరకు చేపలు పెరిగాయి. దీంతో మత్స్యకారులు ప్రతి రోజూ చేపలను పట్టి ఆయా గ్రామాలతో పాటు నగరానికి చేరవేస్తున్నారు. ఆదివారాల్లో గ్రామాల్లో చెరువుల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. తమ గ్రామంలో పెంచిన చేపల కోసం ప్రజలు చెరువుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో చేపలను పట్టుకొని అమ్ముకోవడానికి 180 సోసైటీలు ఏర్పాటు అయ్యాయి. ఈ సోసైటీల ఆధ్వర్యంలో చెరువుల్లో ఉత్పత్తి అయిన చేపలను విక్రయించుకొని జీవిస్తున్నారు. ఈ వృత్తిపై అవగాహన ఉన్న వారిని గుర్తించి మత్సశాఖ ఆధ్వర్యంలో ఈ సొసైటీలను ఏర్పాటు చేశారు. ఈ సొసైటీల్లో గంగపుత్రులతో పాటు ముదిరాజులు కూడా సభ్యులుగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో చేప పిల్లను చెరువులో పెంచడంతో పాటు వాటిని పట్టుకొని విక్రయించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో ఈ వృత్తిపై ఆధార పడిన అనేక కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో వివిధ చెరువులలో ప్రభుత్వం పంపిణీ చేసిన చేపలలో బొచ్చ, రవ్వ, బంగారు తీగ తదితర చేపలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బొచ్చ చేపకు డిమాండ్ ఉండడంతో ఈ చేప పిల్లలను ప్రభుత్వం అధికంగా పంపిణీ చే సింది. పంపిణీ చేసిన చేప పిల్లలు నాణ్యమైనవి కావడంతో సంవత్సరంలోనే పెరిగి పెద్దవి అ య్యాయి.
ఇబ్రహీంపట్నం చెరువులో మొదటి సంవత్సరం వేసిన చేప పిల్లలు ఒక్కోటి 10 కిలో ల వరకు పెరిగాయి. ఇబ్రహీంపట్నం, రావిరాల, ఇంద్రాసాగర్, తుర్కయాంజాల్‌లోని మాసబ్చెరువులోని చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ప్రతి ఆదివారం నగరంతో పాటు వివిధ ప్రాంతాల వారు ఈ చెరువుల వద్దకు వచ్చి చేపలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, రావిరాల, ఇందిరాసాగర్ చెరువులకు మురికి నీరు రాకపోవడంతో ఈ చేపలకు మంచి డిమాండ్ ఉన్నది.
ఇబ్రహీంపట్నం చెరువులో ప్రభుత్వం పంపి ణీ చేసిన చేప పిల్లలను చెరువులో వేయడంతో ఇప్పుడు అవి ఒక్కో చే ప దాదాపు 5 నుంచి 6 కిలోల వరకు బరువు పెరిగాయి. ఎన్నో గ్రా మాల నుంచి చెరువు వద్దకు వచ్చి కోనుగోలు చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు చేపలను తరలిస్తున్నాం. ఎం తో మంది మత్స్యకారుల కుటుంబాలు నేడు చేపల పంపిణీతో మంచి ఆదాయం పొంది సంతోషంగా ఉంటున్నాం. పతి కుటుంబానికి మంచి ఆదాయం వస్తున్నది.
– భీంరావు, మత్సకారుడు, ఇబ్రహీంపట్నం