కడ్తాల్ : జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ దేవతను శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ యేడు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు భాగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి సాధించాలని కోరుతూ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ వాహనాలకు పూజలు చేయించుకున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు ఉన్నారు.