వికారాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు అధ్వానంగా మారాయి. ఇక్కడ పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశించే వారికి నిరాశే ఎదురవుతున్నది. ఓ వైపు సరైన సౌకర్యాలు లేకపోవడం.. మరోవైపు సమయానికి వైద్యమందించే వైద్యులు లేక రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆధీనంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానతోపాటు మాతాశిశు, ఏరి యా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అధికారులు, వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లున్నాయి.
వైద్యావిధాన పరిషత్ ఆధీనంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాక్టీస్‌కే పరిమితం అవుతుండడంతో తీవ్ర విమర్శలున్నాయి. జిల్లా, ఏరి యా దవాఖానలు, మాతాశిశు సంరక్షణాస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల్లో మెజార్టీ డాక్టర్లు సొంత క్లినిక్‌లను నడిపిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారు. వీరి ని పర్యవేక్షించాల్సిన డీసీహెచ్‌ఎస్‌తోపాటు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లూ ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతా లు తీసుకుంటూ సొంత క్లినిక్‌లోనే ప్రాక్టీస్‌కే ప్రాధాన్యమిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మాత్రం మెరుగైన వైద్యం అంద డం లేదు. డాక్టర్లు సమయానికి రాకపోవడంతో వైద్యులకోసం నిరీక్షించి ..నిరీక్షించి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రజలు డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల బారిన పడుతున్నా.. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత కూడా రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నది.
తాండూరులోని ప్రభుత్వ జిల్లాస్పత్రిలో వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగు లు ఇబ్బంది పడుతున్నారు. పేరుకే జిల్లా ఆస్పత్రి తప్పా సేవల్లో మాత్రం అథమంగా మారింది. ఇక్కడ వైద్యులతోపాటు నర్సు లూ సరిపడా ఉన్నా ఒక వైద్యుడు 24 గంటలపాటు విధులు నిర్వర్తిస్తూ, వారానికి ఒక రే హాజరవుతున్నారు. దీంతో వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. 24 గంటలపాటు వైద్యం అందించాల్సిన జిల్లాసుపత్రిలో మధ్యాహ్నం వరకే వైద్యులుండడం, తర్వాత వచ్చే వారికి నర్సులే చికిత్స చేస్తున్నారని పలువురు రోగు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిలాస్పత్రిలో అధ్వానంగా పారిశుధ్య వ్యవస్థతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ పైప్లైన్ల లీకేజీతో పరిసరాల్లో మురుగు పరుగులు తీస్తుం డడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.