షాద్‌నగర్‌టౌన్, మార్చి 4 : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లాలని, ఇంట్లోని చిన్నారులకు పోలియో చుక్కలను తప్పకుండా వేయాలని షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి వైద్య సిబ్బందికి సూచించారు. ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెల్జర్ల సబ్ సెంటర్లో సోమవారం ఇంటింటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలియో చుక్కలు వేయడం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 36956 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఆప్తాల్మిక్ ఆఫీసర్ శ్రీహరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్ మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆదిబట్లమున్సిపల్ కార్యా లయ ఆవరణలో ఆయన చిన్నారులకు వైద్యారోగ్యశాఖ సిబ్బం దితో కలిసి చుక్కల మందును పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.