ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
రానున్న పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి పోలీసులు, ఇతర ఎన్నికల సిబ్బంది సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు.
- మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి
- గురునానక్ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం
ఇబ్రహీంపట్నం, మార్చి 28 : రానున్న పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి పోలీసులు, ఇతర ఎన్నికల సిబ్బంది సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. అనంతరం పోలీసులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న చెక్‌పోస్టుల్లో నిఘాను మరింత పెంచాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద లభించిన డబ్బులు, బంగారం, వెండి ఇతరత్రా ఆకర్షణీయ వస్తువులు దొరికిన వెంటనే కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో అప్పజెప్పాలన్నారు. ఎన్నికల కోడ్‌కు విఘాతం కల్పించేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు గ్రామాల్లో బెల్టు షాపులను కూడా పూర్తిస్థాయిలో మూసివేయాలన్నారు.
ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే చర్యలను సహించవద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరగడం కోసం పోలీసులు, రెవెన్యూ, ఇతర ఉద్యోగులు సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం పీవీఎస్ రాజు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, సీఐలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

