Best Technique in Cultivation | రైతులు ఈ విధానం ఎంచుకుంటే మం చి లాభాలను ఆర్జించొచ్చు.. శ్రమ కూడా ఆదానే!
Best Technique in Cultivation | వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అంది పుచ్చుకుం టున్నారు. సులభ విధానంలో వ్యవసాయం చేయ డం.. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు మొగ్గు చూపుతున్నారు.
Best Technique in Cultivation | ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 10: వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అంది పుచ్చుకుం టున్నారు. సులభ విధానంలో వ్యవసాయం చేయ డం.. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పం టలను సాగు చేసేందుకు సూక్ష్మ, తుంపర సేద్యం విధానం ఎంతో దోహదపడుతుంది. సాగునీటి ఎద్దడి ఉండే మెట్ట ప్రాంతాల్లో తుంపర సేద్యం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా మం చి లాభాలను ఆర్జించొచ్చు.
ఆరుతడి పంటలైన వేరుశనగ, శనగ, మొక్కజొన్న, బొబ్బెర్లు, కందు లు, పెసర్లు, పత్తితోపాటు పలు రకాల ఆకుకూరలు, కూరగాయల పంటలను తుంపర సేద్యం ద్వారా విరివిగా పండించొచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తుంపర సేద్యం లో డ్రిప్, స్ప్రింక్లర్ల వాడకం ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. డ్రిప్ విధానంలో పంటల్లోని ప్రతి సాలుకు సన్నని పైపు అమర్చి ఒక్కో చుక్కనీరు మొక్క మొదలులో పడేలా చేయడం, స్ప్రింక్లర్ల విధానంలో పంటలో పెద్ద పైపులు వేసి స్ప్రింకర్ల్ హెడ్ ద్వారా నీటిని విరజిమ్మి పంటకు నీరందించడం జరుగుతుంది.
తక్కువ ఖర్చుతోనే స్ప్రింక్లర్ల ఏర్పాటు..
తుంపర సేద్యంలో భాగంగా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు ఖర్చు కూడా తక్కువే అని చెప్పొచ్చు. ఎకరం భూమిలో పంట సాగు కోసం స్ప్రింక్లర్ల పైపుల కోసం రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చువుతుంది. రెండు ఎకరాలకు రూ.7వేల వరకు, మూడు నుంచి నాలుగు ఎకరాలకు రూ.9వేల నుంచి రూ.12వేల వరకు ఖర్చుఅవుతుంది. పైపుల సైజులను బట్టి ఖర్చులోనూ తేడాలుంటాయి. అయితే, రైతులు కొనుగోలు చేసిన స్ప్రింక్లర్పైపులు, హెడ్ వాల్వ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఎక్కువ రోజు లు ఎలాంటి అవాంతరాలు లేకుండా పంటలకు నీటిని అందిస్తాయి.

స్ప్రింక్లర్లు అమర్చే విధానం..
స్ప్రింక్లర్లను మూడు విధాలుగా పంట పొలాల్లో అమర్చుకోవచ్చు. శాశ్వతంగా పైపులను భూమిలో పాతిపెట్టి స్ప్రింక్లర్ హెడ్లను అమర్చి నీటిని విరజిమ్మడం మొదటి విధానం.. కొన్ని పైపులు భూమిలోపల ఉంచి మిగతా పరికరాలను బయట ఉంచి మొక్కలన్నింటికీ తుంపర్లు పడేలా అమర్చుకోవడం రెండో పద్ధతి.. ఇక స్ప్రింక్లర్ పైపులన్నీ భూమిపైనే ఉంచి పంటకు నీరందించడం మూడో విధానంగా చెప్పొచ్చు. ఇందులో పైపులను ఒక్కచోట నుంచి మరో చోటుకు తరలించి అన్ని పంటలకు తుంపర సేద్యం ద్వారా నీటిని అందించేందుకు వీలవుతుంది.
స్ప్రింక్లర్లో ముఖ్యమైనది స్ప్రింక్లర్హెడ్, ఇందులో రెం డు రంధ్రాలుంటాయి. ఒకటి 4 నుంచి 5.6మి.మీల సైజు ఉండగా, ఇంకోటి 3.13 మి.మీల సైజు ఉంటుంది. ఎక్కువ పీడనం గల స్ప్రింక్లర్ సుమారు 35 మీటర్ల వ్యాసం కలిగిన భూమిని తడుపుతుంది. తక్కువ పీడనం గల స్ప్రింక్లర్ 30మీటర్ల వ్యాసంగల భూమిని మాత్రమే తడుపుతుంది.
రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు, పలు వాణిజ్య పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. జిల్లాను గతంలో క్రాప్‌కాలనీల కింద ఎంపిక చేసి పెద్ద ఎత్తున కూరగాయలు, తీగజాతి కూరగాయలు, ఆకుకూరల సాగుకు రైతులను ప్రోత్సహించింది. రైతులు నేటికి అదే రీతిలో పంటలు సాగుచేసుకుంటూ బిందు..తుంపర సేద్యం ద్వారా పంటలను సాగు చేసుకుంటున్నారు.
ఐదెకరాల వరకు పండ్లు, కూరగాయలు సాగుచేసుకునే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీ, బీసీ రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందిస్తున్నది. డ్రిప్ పరికరాలు అవసరం ఉన్న పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసుకునే రైతులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఉద్యానవన అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే రైతులకు బిందు సేద్యానికి సంబంధించిన పరికరాలను సబ్సిడీపై అందిస్తారు.
తక్కువ శ్రమ, తక్కువ సాగునీటి వినియోగం వంటి సులభ పద్ధతులతో పం టలను సాగుచేసి దిగుబడులు పెంచుకోవాలి. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా పంటలకు సరిపడా నీటిని అందించటంతోపాటు శ్రమ, సమయం కలిసి వస్తుంది. పంటకు స్ప్రింక్లర్లను అమర్చి కొంత సమయాన్ని ఇతర పనులకు కేటాయించుకునే అవకాశం ఉంటుంది. డ్రిప్, స్ప్రింక్లర్ల ఏర్పాటుకు ఖర్చు తక్కువే. ఆరుతడి పంటల సాగుకు ఇవి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ విధానంపై దృష్టి సారిస్తే మంచి దిగుబడులను సాధించొచ్చు.
-మొద్దు అంజిరెడ్డి, ఉత్తమరైతు, ఇబ్రహీంపట్నం
బిందు, తుంపర సాగు విధానంలో పంటకు సమయానికి సరిపడానీరు అంది పంట ఏపుగా పెరుగుతుంది. దీంతో మంచి దిగుబడులు వస్తాయి. పాత పద్ధతిలో పంటకు నీరందించాలంటే ఎక్కువనీరు వృథా అయ్యేది. తక్కువ నీటి వనరులు ఉన్న మెట్ట ప్రాంతాల్లో డ్రిప్, తుంపర విధానంలో పంటలను సాగు చేసేం దుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆరుతడి పంటలు వేసి రైతులు ఈ మార్గాన్ని ఎంచుకోవడం ఎంతో మంచిది.
-శ్రవణ్‌కుమార్, ఏఈవో వ్యవసాయశాఖ, ఇబ్రహీంపట్నం
తుంపర సేద్యంతో లాభాలు..
- తుంపర సేద్యంలో పొలంగట్లు, కాలువలు, మడులు చేయాల్సిన అవసరం లేదు. దీంతో రైతుకు ఉన్న భూమిలో పంటను సాగు చేసుకోవచ్చు.
- సంప్రదాయ నీటి పారే విధానంతో పొలంగట్లు, కాలువగట్లకు 35 శాతం వరకు నీరు వృథాగా పోతుంది. కానీ స్ప్రింక్లర్లతో ఈ నష్టం ఉండదు.
- సాగు చేసిన పంటకు నీటిని తరచూ అవసరమైన పరిమాణంలో ఇవ్వడం ద్వారా పంట ఏపుగా పెరిగి దిగుబడులు కూడా సాధారణం కంటే 5నుంచి 20శాతం వరకు అదనంగా వస్తాయి.
- స్ప్రింక్లర్ల విధానంలో భూమి లోని పొరల్లోకి నీరు వెళ్లకుండా మొక్కల వేళ్ల వరకే వెళ్లి మొక్కకు కావాల్సిన నీరు అందుతుంది.
- స్ప్రింక్లర్ల నుంచి వెలువడే నీటి తుంపర్ల వల్ల భూమిపై నీరునిల్వ ఉండదు. మట్టి గడ్డ కట్టదు. అవసరమైన నిష్పత్తిలో నీరు, గాలి భూమిలో ఉంటూ విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తి పంట దిగుబడి కూడా పెరుగుతుంది.
- తుంపర సేద్యంతో ఎగుడు, దిగుడుగా ఉన్న భూముల్లోనూ
పంటలు పండుతాయి - డ్రిప్సిస్టంతో పలు రకాల పండ్లతోటలను విరివిగా పెంచుకోవచ్చు.
- బిందుసేద్యంతో 30నుంచి 40శాతం విద్యుత్తు, 30 నుంచి 50శాతం ఎరువులు ఆదా అవుతాయి.
- ఎత్తు, పల్లాలు ఉన్న భూముల్లోనూ అన్ని మొక్కలకు ఒకే మోతాదులో నీరు అందటం వల్ల పంట ఏపుగా పెరుగుతుంది.
- బిందుసేద్యంలో భూమి కోతకు గురికాకుండా..భూసారం కోల్పోకుండా, పంటకు చీడపీడలు రాకుండా ఎంతో మేలు చేస్తుంది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

