యాచారం : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని డీఎస్ఆర్ ఫంక్షన్‌హాల్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ (వేంకటేశ్వరనగర్)కు చెందిన నరేందర్ (45) అనే వ్యక్తి కొంతకాలంగా మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. శుక్రవారం రాత్రి మాల్ నుంచి యాచారం వైపు నడుచుకుంటూ వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం మార్చురికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.