CP Sudhir Babu | తుర్కయంజాల్, సెప్టెంబర్ 4 : వినాయక నిమజ్జనానికి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పోలీసులు, అధికార యంత్రాంగం జిల్లాలు, ప్రాంతాల వారీగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసబ్ చెరువు వద్ద నిమజ్జన తీరును రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు గురువారం సాయంత్రం తుర్కయంజాల్ మున్సిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా నిమజ్జన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిభట్ల సీఐ రవికుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
GST | సిమెంట్, ఉక్కుపై జీఎస్టీ రేట్ల తగ్గింపు.. రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహం..!
Laxmidevipally : ‘పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి’
Nur Khan Base | భారత్ దాడిలో దెబ్బతిన్న నూర్ఖాన్బేస్లో పునర్నిర్మాణ పనులు చేపడుతున్న పాక్