Couple Missing | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 23 : అప్పుల బాధలు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు అదృశ్యమైన ఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన డి సుదర్శన్(41)కు కొన్నేండ్ల క్రితం కర్మన్‌ఘాట్‌కు చెందిన తేజస్విని(36)తో వివాహమైంది. ఈ దపంతులకు జయవర్ధన్(12), ఆదిత్యవర్ధన్(10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సుదర్శన్ వినుత్న మోటార్స్‌లో ప్రైయివేటు ఉద్యోగం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. పెళ్లాయ్యక కొన్నాళ్లు కర్మన్‌ఘాట్‌లో ఉన్నారు. ఆ తర్వాత శంషాబాద్‌కు మకాం మార్చారు. అప్పులు అధికమవడంతో 3 సంవత్సరాల క్రితం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామానికి చేరుకొని అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి వద్ద 2 లక్షల చిట్టి ఎత్తుకొని పద్దులు చెల్లించడంలేదు. దీంతో సదరు వ్యక్తి నర్కూడ గ్రామంలోని అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఇంటి యాజమానికి అడిగితే ఈ నెల 18వ తేదీన బయటికి వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు. చిట్టి వ్యాపారి సుదర్శన్ తల్లికి విషయం చెప్పడంతో ఆమె నర్కూడ గ్రామానికి చేరుకొని అద్దె ఇంటి యాజమానితో పాటు చుట్టు పక్కల వారిని ఎవ్వరికి అడిగిన బాధిత వ్యక్తి ఆచూకీ తెలియలేదు. ఫోన్ చేసినా అతడి ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.