అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 30 : గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ అబ్దుల్లాపూర్‌మెట్ మండలాధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
శ్రేణులు ఐక్యంగా ఉండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధోకాను, అవినీతిని ఇంటింటికీ వివరించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, జగదీశ్, చక్రవర్తిగౌడ్, వెంకట్‌రెడ్డి, ధనంజయ్యగౌడ్, కిరణ్‌కుమార్‌గౌడ్, సాయికుమార్‌గౌడ్, గౌరీశంకర్చారి, యాదయ్యగౌడ్, జ్ఞానేశ్వర్‌గౌడ్, రాధాకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, జీవన్‌కుమార్‌రెడ్డి, రంగయ్యముదిరాజ్, జంగమయ్యయాదవ్, శ్రీశైలంగౌడ్, జంగయ్యయాదవ్, విజయభాస్కర్‌రెడ్డి, ఆయా గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని ఇనాంగూడ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బాల శివుడు తండ్రి మాజీ ఉపసర్పంచ్ సత్తయ్య అనారోగ్యంతో మరణించగా.. బాలశివుడు కుటుంబాన్ని మంగళవారం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు.