ఆమనగల్లు, ఫిబ్రవరి 16 : రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాం గ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు నిరసన దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, స్థానిక నాయకులతో కలిసి ఆయన కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేసిన ఘన త కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాగా రైతు నిరసన దీక్ష ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు కూడా పరీశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ము న్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, మాజీ జడ్పీటీసీ నర్సింహ, మాజీ ఎంపీపీ నిర్మలాశ్రీశైలంగౌడ్, సీనియర్ నాయకులు శ్రీనూనాయక్, జ్యోతయ్య, శ్రీను తదితరులు ఉన్నారు.