మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్‌లా మీద షాక్ తగులుతున్నది. 24 నెలలు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా ఆ పార్టీ నేతలను జనం ప్రశ్నిస్తుండడంతో వారికి సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. శనివారం షాద్‌నగర్, తాండూరు మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, రోహిత్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
షాద్‌నగర్, జనవరి 31 : బీఆర్ఎస్ హయాంలోనే షాద్‌నగర్ పట్టణం అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివా రం షాద్‌నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పదోవార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 24 నెలలు దాటినా ప్రచారం తప్పా..
మున్సిపాలిటీలో అభివృద్ధే లేదని ఎద్దేవా చేశారు. గత కేసీఆర్ పాలనలో రూ. వందల కోట్ల నిధులను వెచ్చించి మున్సిపాలిటీలోని అన్ని కాలనీలను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. ఇం టింటికీ మంచి నీటిని అందించిన ఘన త కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పార్టీలో చేరిన కృష్ణ, రాము, గణేశ్, భిక్షపతి, నరేశ్, రాము, మల్లేశ్, శివ, శ్రీకాంత్, కుమార్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శివ, భిక్షపతి, వినోద్, హరీశ్, కార్తిక్, పాండు పాల్గొన్నారు.