విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలు పోషిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాతలు. దర్శక, నిర్మాత త్రినాథరావు నక్కిన ఇందులో ఓ ముఖ్య పాత్ర కూడా పోషిస్తుండటం విశేషం. ఆగస్ట్ 7న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో టాలీవుడ్ థండర్స్ టీంతో కలిసి, వేలాదిమంది సమక్షంలో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. నటులు శ్రీకాంత్, తరుణ్, సుధీర్‌బాబు, అశ్విన్‌బాబు, సంగీత దర్శకుడు తమన్ తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, తారక్ పొన్నప్ప విలనీ, యాక్షన్ సీక్వెన్స్ ఈ ట్రైలర్లో హైలైట్స్‌గా చెప్పొచ్చు. ఈ చిత్రానికి కెమెరా: మాయా.వి, సంగీతం: దేవ్‌జండ్, నిర్మా ణం: భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్.