హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) కొనసాగుతున్నది. సర్ డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్లో ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలు నత్తనడకను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 3,38, 26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు (ఈఎఫ్లు) పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. 93.16 % డిజిటైజేషన్తో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 90.58%తో జనగామ రెండో స్థానంలో, 89.04%తో మహబూబాబాద్ మూడో స్థానంలో, 89.68 %తో మెదక్ నాలుగుస్థానంలో, 88.73 %తో కుమ్రం భీం ఆసిఫాబాద్ ఐదోస్థానంలో నిలిచాయి.
డిజిటైజేషన్లో ఇప్పటివరకు 2,54, 13,878 ఫారాలను ఆన్లైన్లో నమో దు చేశారు. ఇది మొత్తం ఫారాల్లో 75.13 %కు సమానమని సీఈవో నివేదిక వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో సర్ డిజిటలైజేషన్ నెమ్మదిగా సాగుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే చాలా తకువ పురోగతి నమోదైంది. హైదరాబాద్ 52.98%, మేడ్చల్ మలాజిగిరి 57.56%, రంగారెడ్డి 60.98% తో ఆన్లైన్ ప్రక్రియలో వెనుకబడి ఉన్నాయి.