మాల్, సెప్టెంబర్ 30 : చింతపల్లి గ్రామానికి చెందిన అష్రాఫ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నవీనా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన బీఆర్ఎస్ చింతపల్లి మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి ఆస్పత్రికి వెల్లి ఆష్రాఫ్ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు దవాఖాన ఖర్చులకు గాను రూ.10 వేల ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వింజమూరి రవి, బాల్ సిగ్, ఖాలెద్, యాసిన్ బాబా, ఫయాజ్ పాల్గొన్నారు.