– టీయూడబ్ల్యూజే నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్
– టీయూడబ్ల్యూజే(143) యూనియన్ నల్లగొండ మండల నూతన కమిటీ ఎన్నిక
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 30 : జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా టీయూడబ్ల్యూజే(143) ముందుకు వెళ్తుందని ఆ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం నల్లగొండ కమిటీ నూతనంగా ఎన్నికైన సందర్భంగా వారిని అభినందించి మాట్లాడారు. ప్రస్తుతం జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పరంగా ఒక్క నిమ్స్ ఆస్పత్రిలోనే చెల్లుబాటు అవుతుందని అయితే అన్ని ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కూడా క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్రమంతటా పోస్ట్ కార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నందున జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
టీయూడబ్ల్యూజే(143) యూనియన్ నల్లగొండ మండల నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిక్కుల యాదగిరి (ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శిగా పేరం సుభాష్ ( వార్తా వేదిక సూర్య ) ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గోలి విజయ్ కుమార్, నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్, సముద్రాల నరసింహమూర్తి, జిన్నే శ్రీనివాసరెడ్డి, పోగుల రమేష్, ముచ్చర్ల శ్రీనివాస్, కారింగు వెంకన్న, ఎర్రబెల్లి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.