– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు, సెప్టెంబర్ 30 : విద్యాదానంలో మంచికంటి వారి సేవలు అభినందనీయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలోని మంచికంటి గోపమ్మ స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ రామ్ రెడ్డి విద్యార్థులకు అందజేస్తున్న స్టడీ మెటీరియల్, బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోడంగిపర్తి గ్రామానికి చెందిన మంచికంటి లక్ష్మయ్య మంచికంటి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి భవనాలను నిర్మించి పేద ప్రజలకు విద్యాదానం చేయడం ఎంతో గొప్ప విషయం అని కొనియాడారు.
బోడంగిపర్తి లోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నడుస్తూ, ఉత్తీర్ణత సాధిస్తున్నాయని అన్నారు. ఈ పాఠశాలకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు నిర్వాహకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీవో వందనపు శ్రీదేవి, ఎంపీడీఓ బండారు యాదగిరి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఉట్కూరి సుధాకర్ రెడ్డి, మంచికంటి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మంచికంటి వెంకటరమణ, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

‘మంచికంటి సేవలు అభినందనీయం’