Mark Boucher : ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ మాజీ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ (Mark Boucher) మరోసారి కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. గతంలో ముంబై ఫ్రాంచైజీతో కొనసాగిన ఈ వెటరన్ క్రికెటర్ ఇంటర్నేషనల్ టీ20లీగ్(ILT20)లో ఎంఐ ఎమిరేట్స్ (MI Emirates) జట్టుకు హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాడు.
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్‌ను మరోసారి హెడ్‌కోచ్ పదవి వరించింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు రెండు సీజన్లు(2023, 2024) కోచ్‌గా వ్యవహరించిన బౌచర్ ఈసారి.. సిస్టర్ ఫ్రాంచైజీని దిశా నిర్దేశం చేయనున్నాడు. ఇంటర్నేషనల్ టీ20లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌కు ప్రధాన కోచ్‌గా బౌచర్ నియమితులయ్యాడు. భారత్‌కు చెందిన రాబిన్ సింగ్ స్థానంలో అతడు వచ్చే సీజన్ నుంచి ఎంఐకి కోచింగ్ ఇవ్వనున్నాడు. సుదీర్ఘ అనుభవమున్న బౌచర్‌ను ఎంఐ ఎమిరేట్స్‌కు దిశా నిర్దేశం చేయనున్నాడనే విషయాన్ని ముంబై యాజమాన్యం బుధవారం ప్రకటించింది.
A winner’s mindset, a builder’s ambition, a champion’s heart💙
Welcoming our Head Coach Mark Boucher 💪
Read more: https://t.co/rXhuWkaNn3#MIEmirates #OneFamily pic.twitter.com/KbXt2J6RFK
— MI Emirates (@MIEmirates) September 30, 2026
రాబిన్ సింగ్ హయాంలో 2024లో తొలిసారి ఐఎల్టీ20లో ఛాంపియన్‌గా నిలిచింది ఎంఐ ఎమిరేట్స్. 2025-26 ఎడిషన్‌లోనూ ఫైనల్ చేరింది. కానీ, డెజర్ట్ వైపర్స్ చేతిలో ఓటమితో రెండో టైటిల్ చేజార్చుకుంది. దాంతో.. ఎంఐని మళ్లీ ట్రోఫీల బాట పట్టించేందుకు బౌచర్ వ్యూహాలు సిద్ధం చేయనున్నాడు. ఐపీఎల్లో ముంబై కోచ్‌గా విమర్శలు ఎదుర్కొన్నాడు బౌచర్. ఐదుసార్లు జట్టును విజేతగా నిలిపిన రోహిత్ శర్మను కాదని.. భవిష్యత్ కోసమంటూ హర్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్‌గా ప్రకటించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
