ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు జేజేలు తెలుపుతూ సోమవారం హైదరాబాద్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేయడానికి ప్రయత్నించిందని చెప్పారు.
- వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు జేజేలు తెలుపుతూ సోమవారం హైదరాబాద్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేయడానికి ప్రయత్నించిందని చెప్పారు. ఈ అణచివేతను, నిర్బంధాన్ని లెక్కచేయకుండా విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. నీట్ వంటి కేంద్రీకృత ప్రవేశ పరీక్షలను రద్దు చేసి, రాష్ట్రాలే తమ పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే హకు కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు అశోక్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పుట్టా లక్ష్మణ్, మణికంఠరెడ్డి, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి అనిల్, అధ్యక్షుడు మహేశ్, ఏఐడీఎస్వో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నితీశ్ పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రౌషన్ కుమార్ సిన్హా, విద్యార్థి, యువజన నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కే ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

