షాబాద్, జనవరి 26 : చేవెళ్ల బీఆర్ఎస్లో చేరికల జోరు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల వేళ గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు వస్తున్నారు. చేవెళ్ల సెగ్మెంట్లోని కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాల మధ్య పోరుతో క్యాడర్లో గందరగోళం నెలకొన్నది. అభద్రతాభావంతో ఉన్న నేతలంతా బీఆర్ఎస్లో చేరుతున్నారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆ పార్టీ నాయకులే కాంగ్రె స్కు గుడ్‌బై చెబుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన యాదయ్య కాంగ్రెస్‌లో చేరడం తో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి చేవెళ్లకు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. శ్రేణులకు నేనున్నానంటూ అండగా నిలుస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ..పార్టీ బలోపేతానికి పాటుపడుతున్నారు. దీంతో ఇతర పార్టీల నేతలు సబితారెడ్డి సమక్షంలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో చేవెళ్ల సెగ్మెంట్లోని మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేసేందుకు సబితారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ప్లాన్ చేస్తున్నారు. ఒక్క జనవరిలోనే వేల సంఖ్యలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ఊరెళ్లకు చెందిన ఒకటోవార్డులోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు 250 మంది సబితారెడ్డి, కార్త్తిక్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా చేవెళ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, ఆయన సతీమణి లత, వారి అనుచరులు బీజేపీ నుంచి.. అలాగే, దామరగిద్దకు చెందిన కొంతమంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. దేవునిఎర్రవల్లి మాజీ సర్పంచ్ శ్యామలయ్యతోపాటు ఆనంద్ మరో 50 మంది కార్యకర్తలు తెలంగాణభవన్‌లో కేటీఆర్, సబితారెడ్డి సమక్షంలో
గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. శంకర్పల్లి మం డలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ సంతోష్, మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్‌గౌడ్ తదితరులు.. అలాగే, ఇటీవల షా బాద్‌లో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి సమక్షంలో అంతారం, తిర్మలాపూర్లకు చెం దిన కాంగ్రెస్ నాయకులు.. మొయినాబాద్‌లో పార్టీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
తాజాగా సోమవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి సమక్షంలో చేవెళ్ల బీజేపీ మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి, ఆయన అనుచరులు భాస్కర్‌రెడ్డి, మల్లారెడ్డి, అనంతరెడ్డి, రఘుపతిరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, అభిలాశ్రెడ్డిలతోపాటు 200 మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్, పార్టీ సీనియర్ నేతలు దేశమళ్ళ ఆంజనేయులు, పట్లోళ్ల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.