బొంరాస్‌పేట, జూన్ 8 : రానున్నది మన ప్రభుత్వమేనని.. కొత్త, పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సమక్షంలో దుద్యాల మండలంలోని కుదురుమళ్ల గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మడిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అందరూ కలిసి కట్టుగా పని చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో నరసింహారెడ్డి, వెంకటప్ప, శివరాజ, వెంకటేశ్, బాబు, పెద్ద లక్ష్మణ్, నరసింహ, రాఘవేందర్, గోపాల్, గోవింద్ తదితరులు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వడంలేదని.. అక్కడ అవమానాలను భరించలేకనే పార్టీ వీడినట్లు చెప్పారు. సీఎం సొంత నియోజకవర్గంలో పార్టీలో కొత్తగా చేరిన వారికే అధిక ప్రాధాన్యమిస్తూ.. పాత వారిని పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బొజ్జప్ప, వెంకట్ రాములు, ఇమ్రాన్, నరేశ్‌గౌడ్, నర్సింహులు, సాయిలు పాల్గొన్నారు.