వికారాబాద్, సెప్టెంబర్ 13 : ప్రజా పాలన అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 21 నెలల పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. శనివారం ఆమె సమక్షంలో కాంగ్రెస్ పా ర్టీకి చెందిన నవాబుపేట మండల మాజీ వైస్ ఎంపీపీ బందయ్యగౌడ్, అక్నాపూర్ మాజీ సర్పంచ్ వేమరెడ్డి, గేటువనంపల్లి మాజీ సర్పంచ్ గోపాల్‌యాదవ్, ఉప సర్పంచ్‌లతోపాటు సుమా రు 100 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా సబితారెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి నవాబుపేట మండలంలోని నాయకులు భారీ షాక్ ఇచ్చారన్నారన్నారు. ఈ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలం చెందిందని.. సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజలు గత 60 రోజులుగా యూరియా కోసం పొలాల్లో పనులను వదులుకొని మరీ రోడ్డెక్కుతున్నా రేవంత్ సర్కార్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశా రు. కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న రోజుల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్తోనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని భావించి.. బీఆర్ఎస్లో చేరేందుకు ప్రజలు, నాయకులు ముందుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, సీనియర్ నాయకుడు భరత్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతికుమార్, పురుషోత్తం, మం డల ఉపాధ్యక్షులు అఫ్సర్‌ఖాన్, నరేందర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, నాయకులు మల్లేశ్, శేఖర్, కుమార్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.