తాండూరు రూరల్, డిసెంబర్ 6 : బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాయని..రెండేండ్ల రేవంత్ పాలనలో పల్లె లు అభివృద్ధిలో వెనుకబడి పోయాయని తాండూ రు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మండలంలోని జినుగుర్తి, మల్కాపూర్, ఐనెల్లి, గుంతబాసుపల్లి, కోటబాసుపల్లి తదితర గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ సుడిగాలి పర్యటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి.. ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. గత కేసీఆర్ హయాంలో పల్లెలు పచ్చగా ఉం డేవని.. నేడు ఎక్కడ చూసినా పారిశుధ్య లోపం, చెత్తాచెదారంతో నిండిపోయి.. ప్రజలు సమస్యల తో ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించాలని ఓటర్లను కోరారు. మరో మూడేండ్ల తర్వాత రానున్నదని మన ప్రభుత్వమేనని జో స్యం చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మండల పా ర్టీ అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాం లింగారెడ్డి, పార్టీ బలపరచిన అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.