బడంగ్‌పేట, మే 21 : ప్రజల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో 75 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీల్లో ఒక్క హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేంతవరకు ప్రజల పక్షాన పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, కమిషనర్ వాణిరెడ్డి పాల్గొన్నారు.