కడ్తాల్, ఆగస్టు 5: అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు, మాయ మాటలను గుప్పించి, తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో చల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ చేరిన వారిలో శ్రీకాంత్‌యాదవ్, బాలకృష్ణ, మధు, మహేశ్, గణేశ్, లింగం, సురేశ్, రమేశ్, మల్లేశ్, శ్రీరాములు, వంశీ, శ్రీకాంత్, ధనుంజయ్, ఆంజనేయులు నాగరాజుతోపాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. పార్టీలో చేరిన వారికి జైపాల్‌యాదవ్ గులాబీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారాన్ని ఛేజిక్కించుకోవడానికి ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, చల్లంపల్లి మాజీ సర్పంచ్ కృష్ణయ్యయాదవ్, మాజీ ఉప సర్పంచ్ జైపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు సుదర్శన్‌రెడ్డి, శ్రీనుగుప్తా, బీఆర్ఎస్ కడ్తాల్, చల్లంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, ప్రవీణ్‌గౌడ్, రైతు సంఘం మాజీ అధ్యక్షుడు నర్సింహ, నాయకులు బాలయ్య, శివ, శ్రీశైలం, రమేశ్, రాములు, వెంకటేశ్, శ్రీకాంత్, చరణ్, భిక్షపతి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.