రంగారెడ్డి, జనవరి 23 (నమస్తే తెలంగా ణ) : జిల్లాలో మూడో రోజూ గందరగోళం మధ్యనే గ్రామ, వార్డు సభలు జరిగాయి. గురువారం పలు మండలాలు, మున్సిపాలిటీల్లో సభలు కొనసాగగా.. తమ పేర్లు రాలేదంటూ అనేక మంది అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు. అర్హులను విస్మరించి పైరవీకారులు, నాయకులు చెప్పిన వారి పేర్లు మాత్రమే వచ్చాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన గ్రామసభకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.
మంత్రి ప్రసంగం ముగించుకుని తిరిగి వెళ్లిన తర్వాత అక్కడున్న మహిళలు తమ పేర్లు రాలేదంటూ అధికారులను నిలదీశారు. అర్హులకు కాకుండా భూములు, ఇండ్లు, కార్లున్న వారి పేర్లు మాత్రమే రావడమేమిటని మున్సిపల్ చైర్మన్ నిరంజన్‌రెడ్డితోపాటు అక్కడున్న కౌన్సిలర్లను ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అర్హులకే ఇస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కిందిస్థాయిలో మాత్రం అనర్హులకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.యాచారం మండలంలోని నల్లవెల్లి గ్రా మంలో జరిగిన గ్రామసభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.
ఇండ్లు, రేషన్‌కార్డులకు సంబంధించి రూపొందించిన జాబితాలో అర్హుల పేర్లు లేవని..ఇష్టానుసారం గా ఇతరుల పేర్లు రాసి పేదలకు తీవ్ర అన్యాయం చేశారంటూ స్థానికులు అధికారులను నిలదీశారు. అలాగే, మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామం లో జరిగిన గ్రామసభలోనూ అర్హులకు అన్యాయం జరిగిం దంటూ మహిళలు అధికారులను నిలదీశారు. సంక్షేమ పథకాలు పేదలకు కాకుం డా ధనికులకు ఇస్తున్నారని ఆరోపించారు.
మొయినాబాద్ మండలంలోని పెద్ద మం గళారం గ్రామంలో కూడా ఇండ్లు, రేషన్‌కార్డుల జాబితాలో అర్హులకు కాకుండా అనర్హులకు ప్రాధాన్యమిచ్చారని ప్రజలు అధికారులను నిలదీశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఇనాంగూడ, బాటసింగారం తదితర గ్రామాల్లోనూ అర్హులవి కాకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వారి పేర్లు మాత్రమే చదివి వినిపిస్తున్నారని, అర్హులకు అన్యాయం చేస్తు న్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశా రు.
ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్ గ్రామంలో అర్హులందరికీ ఇం దిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో గురువారం పోలీసు పహారా మధ్య గ్రామసభ జరిగింది. గ్రామసభను అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు పలువురు స్థానికులను ముందుగానే అరెస్టు చేశారు. అర్హు ల జాబితాలో తమ పేర్లు రాలేదని, పలువురు అధికారులను నిలదీయగా పోలీసు లు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు.
జిల్లాలో గ్రామసభలు పోలీసుల కను సన్నల్లో సాగుతున్నాయి. ప్రజలు సమ స్యలపై అధికారులను ప్రశ్నిస్తే వెంటనే వారిని అక్కడి నుంచి పోలీసులు పంపించేస్తున్నారు. అలాగే, పేదలకు కాకుండా ధనికులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎవరైనా అధికారులను నిలదీస్తే పోలీసులు జోక్యం చేసుకుని వారిని గ్రామసభల నుంచి మరోచోటుకి పంపిస్తున్నారు. కాగా ఎలిమినేడు గ్రామంలో అధికారులను స్థానికులు ప్రశ్నిస్తారని గుర్తించిన పోలీసులు పలువురిని ముందుగానే అరెస్టు చేశారు.
ఎలిమినేడు గ్రామంలోని చాలామంది రైతులు కంపెనీల ఏర్పా టు కోసం తమ భూములు ఇచ్చారు. అయితే ప్రభుత్వం మా త్రం సరైన పరిహారాన్ని ఇవ్వలేదు. గత కొంతకాలంగా పరిహారాన్ని పెంచాలని ఆందోళన చేస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు రైతుల భూములకు పరిహారాన్ని మరింత పెంచుతామని..ఎకరాకు 120 గజాల చొప్పు న ఇంటి స్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గ్రామసభలో అడిగేందుకు వెళ్తామనుకుంటే పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. రైతులకు జరిగిన అన్యాయంపై గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లలో ఫిర్యాదు లు చేసినా న్యాయం జరగడం లేదు. ప్రభుత్వం తమ గొంతు నొక్కుతున్నది.
-శ్రీకాంత్‌రెడ్డి, భూ పోరాట సమితి అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం రూరల్
ఆదిబట్ల గ్రామంలో అర్హులైన వారికి ఇం డ్లు, రేషన్‌కార్డులు రాలేదు. అర్హత లేని వారికి
మాత్రమే వచ్చాయి. ఈ విషయాన్ని మంత్రికి చెప్పేందుకు వెళ్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి. తనలాంటి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డు ఇవ్వాలి.
-సంతోష, ఆదిబట్ల మున్సిపాలిటీ
ఆదిబట్లలో కొన్నేండ్లుగా కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నా. రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా.. అధికారులు నిన్న చదివి వినిపించిన జాబితాలో పేరు వచ్చింది. అయితే మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ రోజు వేసిన జాబితాలో తన పేరు రాలేదు. రాత్రికి రాత్రే ఆ జాబితాను తారుమారు చేశారు. తమకు ఎలాంటి ఆస్తులు, భూముల్లేవు, రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి.
-మదిలేటి, ఆదిబట్ల మున్సిపాలిటీ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలి. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే అక్రమంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదు. అక్రమ అరెస్టులు చేస్తే ఊరుకునేది లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ను అందించి ఆదుకోవాలి. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను త్వరగా అమలు చేయాలి.
-బుట్టి చంటి..