షాబాద్, మే 18: పాఠశాలలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలోని అర్బన్, యూఎల్బీ, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారి సైజుల ప్రకారం డ్రెస్సులను కుట్టించాలన్నారు. జూన్ 7 నాటికి ఒక జత దుస్తులు కచ్చితంగా అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్డీవో పీడీ శ్రీలత, మెప్మా పీడీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.